కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.
1ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
2కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.
3ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.
4యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలా పము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి