ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.
20తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరము నకు ప్రాయశ్చి త్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.
21మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.
22ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.
23మరియు ఏడు దినములు అతడు నిర్దోష మైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను.
24మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి