యెహేజ్కేలు 45:21

మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 45

19ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశు రక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.

20తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరము నకు ప్రాయశ్చి త్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.

21మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.

22ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.

23మరియు ఏడు దినములు అతడు నిర్దోష మైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను.

యెహేజ్కేలు 45 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी