యెహేజ్కేలు 20:36

ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 20

34మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశము లలోనుండియు జనులలోనుండియు నేను మిమ్మును సమ కూర్చి

35జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.

36ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

37చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.

38మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపుర మున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు.

యెహేజ్కేలు 20 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी