సంఖ్యాకాండము 28:4

వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

సందర్భంతో చదవండి · సంఖ్యాకాండము 28

2నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.

3మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుముమీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోష మైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱ పిల్లలను అర్పింప వలెను.

4వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

5దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.

6అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్య మైన దహనబలి.

సంఖ్యాకాండము 28 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी