లేవీకాండము 5:17

​చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరిం చును.

సందర్భంతో చదవండి · లేవీకాండము 5

15ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విష యములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాయొద్దకు వాడు తీసికొని రావలెను.

16​పరిశుద్ధమైనదాని విషయ ములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆ యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

17​చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరిం చును.

18కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

19అది అపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము.

లేవీకాండము 5 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी