దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
14యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరి గెను.
15దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
16దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
17సౌలుమీరు లెక పెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.
18దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగాదేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి