కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
23ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
24దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
25కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
26దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
27సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి