గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కు లలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.
4నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.
5నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.
6గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కు లలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.
7నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండ వలెను.
8చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించు కొని, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి