లేవీకాండము 8:28

అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలి పీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు.

సందర్భంతో చదవండి · లేవీకాండము 8

26​యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడ మును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి

27అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణ ముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను.

28అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలి పీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు.

29అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

30మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠముమీది రక్తములో కొంతయు తీసి, అహరోనుమీదను అతని వస్త్రములమీదను అతని కుమారులమీదను అతని కుమారుల వస్త్రములమీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను.

లేవీకాండము 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी