యెహేజ్కేలు 16:44

సామెతలు చెప్పువారందరునుతల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే యని నిన్నుగూర్చి యందురు.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 16

42ఈ విధముగా నీమీదనున్న నా క్రోధ మును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మాని పోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చు కొందును.

43నీ ¸°వనదినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి, గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను, ఎక్కువైన కామకృత్యము లను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తననుబట్టి నేను నీకు శిక్ష విధింతును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

44సామెతలు చెప్పువారందరునుతల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే యని నిన్నుగూర్చి యందురు.

45​పెనిమిటిని బిడ్డ లను విడనాడిన నీ తల్లితో నీవు సాటి దానవు, పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటి దానవు; నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు,

46నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.

యెహేజ్కేలు 16 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी