అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి
36అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి
37దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూ లము చేసెను.
38అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి
39దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి