ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.
12ఆ సరిహద్దు యొర్దానునదివరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపిం చును. ఆదేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై యుండునని వారి కాజ్ఞాపించుము.
13మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమి్మది గోత్ర ములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞా పించెను;
14ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.
15మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.
16మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి