ద్వితియోపదేశకాండము 1:17

తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 1

15కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.

16అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.

17తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.

18మరియు మీరు చేయవలసిన సమస్తకార్యము లను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.

19మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా రణ్యములోనుండి వచ్చి, అమోరీ యుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.

ద్వితియోపదేశకాండము 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी