అంతట సెరూయా కుమారుడగు అబీషైయెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా
19నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోపకుము; నా యేలిన వాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.
20నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను.
21అంతట సెరూయా కుమారుడగు అబీషైయెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా
22దావీదుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమా ణముచేసి
23నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెల విచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి