ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.
19బత్షెబ రాజైన సొలొమోనునొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు, రాజులేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లికొరకు ఆసనము ఒకటి వేయింపగా, ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను.
20ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజునా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా
21ఆమెషూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లి కిప్పింప వలెననెను.
22అందుకు రాజైన సొలొమోనుషూనే మీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయాకొరకు అడుగుట యేల? అతడు నా అన్న కాబట్టి అతనికొరకును, యాజకుడైన అబ్యాతారుకొరకును, సెరూయా కుమారు డైన యోవాబుకొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను.
23మరియు రాజైన సొలొమోనుయెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి