సంఖ్యాకాండము 35:31

చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.

సందర్భంతో చదవండి · సంఖ్యాకాండము 35

29ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.

30ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.

31చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.

32​మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.

33​మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.

సంఖ్యాకాండము 35 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी