ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.
27నరహత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కను గొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపి నను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
28ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశము నకు తిరిగి వెళ్లవచ్చును.
29ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.
30ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.
31చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి