యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచన ములతో ఉత్తరమిచ్చెను.
11అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
12అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
13యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచన ములతో ఉత్తరమిచ్చెను.
14కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెనునీవు ప్రకటన చేయ వలసినదేమనగాసైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;
15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి