1 దినవృత్తాంతములు 22:9

​నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 22

7మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

8​యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి.

9​నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.

10​​అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.

11నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.

1 దినవృత్తాంతములు 22 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी