దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
17దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
18ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చినీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా
19దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
20అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
21దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవు నట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి