మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
24విత్తులు నులిపిన దానినేగాని విరిగినదానినేగాని చితికినదానినేగాని కోయబడినదానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; మీ దేశములో అట్టికార్యము చేయ కూడదు;
25పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము.
26మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
27దూడయేగాని, గొఱ్ఱపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండ వలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.
28అయితే అది ఆవైనను గొఱ్ఱ మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి