ఇశ్రా యేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి
2తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారు లగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమ కూర్చెను.
3ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.
4ఇశ్రా యేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి
5రాజైన సొలొమోనును ఇశ్రా యేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱలను పశువులను బలిగా అర్పించిరి.
6లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడా రమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణము లన్నిటిని తీసికొని వచ్చిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి