అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
7మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
8రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
9అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
10అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడుఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
11అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి