లేవీకాండము 23:40

​మొదటి దిన మున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను.

సందర్భంతో చదవండి · లేవీకాండము 23

38ఏ అర్పణదినమున ఆ అర్పణ మును తీసికొని రావలెను.

39అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.

40​మొదటి దిన మున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను.

41​అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచ రింపవలెను.

42​నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను.ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

లేవీకాండము 23 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी