ద్వితియోపదేశకాండము 20:6

ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 20

4వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.

5మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టు కొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

6ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

7ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.

8​నాయకులు జనులతో యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.

ద్వితియోపదేశకాండము 20 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी