ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.
3షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.
4యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలము నకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే.
5ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.
6యోనాతానుఈ సున్నతిలేని వారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధ ములు మోయువానితో చెప్పగా
7అతడునీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి