గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
6అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
7మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.
8గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి