లూకా 8:12

​త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమి్మ రక్షణ పొందకుండునట్లు అపవాది5 వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.

సందర్భంతో చదవండి · లూకా 8

10​ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి.)

11​ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.

12​త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమి్మ రక్షణ పొందకుండునట్లు అపవాది5 వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.

13​రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమి్మ శోధనకాలమున తొలగిపోవుదురు.

14​ముండ్ల పొద లలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.

లూకా 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी