2 దినవృత్తాంతములు 30:3

రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.

సందర్భంతో చదవండి · 2 దినవృత్తాంతములు 30

1మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన... యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమాన ములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.

2సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూష లేములో కూడుకొనకుండుట చేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా

3రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.

4ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.

5కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రా యేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.

2 దినవృత్తాంతములు 30 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी