2 సమూయేలు 3:33

మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 3

31దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.

32రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులంద రును ఏడ్చిరి.

33మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.

34ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?నీ చేతులకు కట్లు లేకుండగనునీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగనుదోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి.

35ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను.

2 సమూయేలు 3 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी