దానియేలు 11:14

ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

సందర్భంతో చదవండి · దానియేలు 11

12ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయ పడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.

13ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమ కూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.

14ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

15అంతలో ఉత్తరదేశపురాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

16వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.

దానియేలు 11 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी