యెహేజ్కేలు 29:11

​దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 29

9ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక

10​నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.

11​దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.

12​నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.

13​ప్రభువైన యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడునలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను.

యెహేజ్కేలు 29 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी