1 రాజులు 20:10

బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.

సందర్భంతో చదవండి · 1 రాజులు 20

8నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలును జనులందరును అతనితో చెప్పిరి,

9గనుక అతడుమీరు రాజైన నా యేలిన వానితో తెలియజెప్పవలసినదేమనగానీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా

10బెన్హదదు మరల అతని యొద్దకు దూతలను పంపినాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.

11అందుకు ఇశ్రాయేలురాజుతన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

12బన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరి గించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధ పడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా

1 రాజులు 20 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी