నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి
1మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.
2నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి
3నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధుర ముగా నుండెను.
4మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి