ద్వితియోపదేశకాండము 28:7

నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 28

5నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

6నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.

7నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.

8నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

9నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.

ద్వితియోపదేశకాండము 28 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी