యెహేజ్కేలు 36:2

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆహా ప్రాచీనము లైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 36

1మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వత ములకు ఈ మాట ప్రవచింపుముఇశ్రాయేలు పర్వ తములారా, యెహోవా మాట ఆలకించుడి,

2ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆహా ప్రాచీనము లైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.

3వచనమెత్తి ఈలాగు ప్రవచింపుముప్రభువగు యెహోవా సెల విచ్చునదేమ నగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

4కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుశేషించిన అన్యజనులకు అపహాస్యాస్ప దమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థల ములతోను నిర్జనమైన పట్టణములతోను

యెహేజ్కేలు 36 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी