న్యాయాధిపతులు 1:16

మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.

సందర్భంతో చదవండి · న్యాయాధిపతులు 1

14ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను

15అందుకామెదీవెన దయ చేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయ చేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

16మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.

17యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.

18యూదావంశస్థులు గాజా నుదాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.

న్యాయాధిపతులు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी