అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
11పేతురుకు తెలివివచ్చిప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.
12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
13అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
14ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.
15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి