వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
20ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,
21తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.
22వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
23తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.
24అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయెరాను కట్టించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి