యెహేజ్కేలు 39:13

నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 39

11ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్ర మునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.

12దేశ మును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.

13నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.

14​దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.

15​దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు.

యెహేజ్కేలు 39 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी