యెహేజ్కేలు 21:17

నేనుకూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవా నగు నేనే మాట ఇచ్చి యున్నాను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 21

15వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మ ములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయ బడియున్నది.

16ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము

17నేనుకూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవా నగు నేనే మాట ఇచ్చి యున్నాను.

18మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

19నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పర చుము. ఆరెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.

యెహేజ్కేలు 21 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी