2 దినవృత్తాంతములు 8:6

బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.

సందర్భంతో చదవండి · 2 దినవృత్తాంతములు 8

4మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.

5ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.

6బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.

7ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను

8ఇశ్రాయేలీ యులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.

2 దినవృత్తాంతములు 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी