ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.
3యెహోవా సెలవిచ్చునదేమనగానేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్య మును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్ట బడును.
4సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదే మనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధు లలో కూర్చుందురు.
5ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.
6సైన్యము లకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచి నను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.
7సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదేమనగాతూర్పు దేశములోనుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి