హోరే బులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను.
6మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.
7అరణ్యములో నీవు నీ దేవు డైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాప కము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశ ములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.
8హోరే బులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను.
9ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధ మైన పలకలను తీసికొను టకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.
10అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి