అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
44నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.
45నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
46అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
47జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరము లైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధియిదే అని చెప్పుమనెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి