ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా
13నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.
14నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
15ఆ పదునాలుగు గొఱ్ఱపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా
16ఒక మేక పిల్లను అర్పింవలెను.
17రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱ పిల్లలను విధిప్రకారముగా,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి