2 రాజులు 11:12

అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.

సందర్భంతో చదవండి · 2 రాజులు 11

10యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా

11కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడి కొన మొదలుకొని యెడమ కొనవరకు రాజుచుట్టు నిలిచిరి.

12అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.

13అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి

14రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొనిద్రోహము ద్రోహము అని కేక వేయగా

2 రాజులు 11 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी