2 రాజులు 4:40

తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచిదైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

సందర్భంతో చదవండి · 2 రాజులు 4

38ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.

39అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను.

40తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచిదైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

41అతడుపిండి కొంత తెమ్మనెను. వారు తేగాకుండలో దాని వేసి, జనులు భోజనము చేయు టకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను.

42మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.

2 రాజులు 4 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी