పరమగీతము 3:9

లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

సందర్భంతో చదవండి · పరమగీతము 3

7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు

8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.

9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

10దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.

11సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.

పరమగీతము 3 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी